News June 22, 2024

శ్రీకాకుళం: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైనవారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైనవారికి 45 రోజులపాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంది. పూర్తి వివరాలకు APSSDC వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.

Similar News

News October 5, 2024

శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

image

దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.

News October 5, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి దసరా సెలవులు

image

డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలకు ఈనెల 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ దసరా సెలవులు (6వ తేదీ ఆదివారం సెలవు ) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పీలా సుజాత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 13వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 14 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ప్రకటనలో సూచించారు.

News October 5, 2024

భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.