News January 26, 2026
శ్రీకాకుళం: డీఈవో రవి బాబుకు ఉత్తమ పురస్కారం అందజేత

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవి బాబుకు ఉత్తమ పురస్కారం దక్కింది. విద్యాశాఖలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారని ఆయన తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నానని వివరించారు. జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.