News September 2, 2024

శ్రీకాకుళం: తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. రాష్ట్రంలో పలువురిని ఉద్యోగోన్నతి లభించగా.. వారిలో ముగ్గురు మన జిల్లాకు చెందిన తహశీల్దార్లు ఉన్నారు. సాదు దిలీప్ చక్రవర్తి, పప్పల వేణుగోపాలరావు, ఆమెపల్లి సింహాచలం ప్రమోషన్లు పొందారు.

Similar News

News November 17, 2025

SKLM: ‘కుష్టు వ్యాధిపై సర్వేకు 2,234 బృందాలు నియమించాం’

image

కుష్టు వ్యాధిపై సర్వే‌కు జిల్లా వ్యాప్తంగా 2,234 బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు DMHO డాక్టర్ తాడేల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17-31 వరకు ఈ వ్యాధిపై ఆశా కార్యకర్త, వాలంటీర్‌లు రోజుకు 20 గృహాల్లో సర్వే నిర్వహిస్తారన్నారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని ఆయన వారికి చెప్పారు.

News November 16, 2025

కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

image

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.

News November 16, 2025

మరోసారి ఐపీఎల్‌కు సిక్కోలు యువకుడు

image

ఐపీఎల్‌-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్‌ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్‌లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.