News February 9, 2025
శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
Similar News
News October 31, 2025
SKLM: ‘డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలి’

డ్రైవింగ్‌లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 32 అభ్యర్థుల్లో 10 మందిని డ్రైవింగ్ శిక్షణకు ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 31, 2025
కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని ఒకరు సూసైడ్

కోటబొమ్మాళి(M) నరసింగపల్లిలోని తోటల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2025
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.


