News October 19, 2024
శ్రీకాకుళం: తుఫాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులు

తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలు జారీ చేశారు. వీరంతా ఆయా తీర ప్రాంత మండలాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. తీర ప్రాంత మండలాలైన రణస్థలానికి 80088 03800, ఎచ్చెర్లకు 87900 08399, శ్రీకాకుళంకు 83414 93877, గార 9440814582, పొలాకి 9100997770 నంబర్లు కేటాయించారు.
Similar News
News November 19, 2025
SKLM: ‘విద్యార్థులకు, రైతులకు రుణాలందించే చర్యలు చేపట్టాలి’

విద్యార్థులకు, రైతులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వివిధ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకుల ప్రాముఖ్యతను వివరించారు.ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.మత్స్యశాఖ మెరైన్ పోలీస్ తదితర శాఖలపై చర్చించారు.
News November 18, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


