News October 19, 2024

శ్రీకాకుళం: తుఫాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులు

image

తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఆయా తీర ప్రాంత మండలాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. రణస్థలానికి 80088 03800, ఎచ్చెర్లకు 87900 08399, శ్రీకాకుళంకు 83414 93877, గార 9440814582, పొలాకి 9100997770 నంబర్లు కేటాయించారు.

Similar News

News November 5, 2024

టెట్ పరీక్షలలో సత్తాచాటిన శ్రీకాకుళం వాసి కుంచాల జ్యోతి

image

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించింది. సోమవారం రాత్రి విడుదలైన పరీక్ష ఫలితాలలో శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస గ్రామానికి చెందిన కుంచాల జ్యోతి తన సత్తాను చాటారు. ఈ పరీక్షలలో 150 మార్కులకు గాను ఆమె 149.07 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. పదవ తరగతి పరీక్షల నుంచి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వరకు ఈమె ఉత్తమ ఫలితాలను సాధించారు.

News November 5, 2024

SKLM: రబీ వేరుశనగ పంటకు విత్తనాలు సిద్ధం

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఈ ఏడాదిలో రబీలో పంట సాగు చేసే రైతుల కోసం సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి కె. త్రినాధ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సీజనుకు గాను రైతు సేవా కేంద్రాలలో అధిక దిగుబడి నిచ్చే వేరుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు, రైతు సేవ కేంద్రాలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

News November 4, 2024

శ్రీకాకుళం: ఎస్పీ పరిష్కార వేదికకు 65 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కారంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఆయా అధికారులకు ఆదేశించారు.