News September 1, 2024

శ్రీకాకుళం: తుఫాన్ సహాయక చర్యలకు ప్రత్యేక అధికారులు

image

తుఫాన్ వర్షాలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ప్రకటించారు. రణస్థలంకు లక్ష్మణమూర్తి (9121251111), గారకు బీ శాంతిశ్రీ (9440814582), పోలాకి ఆర్ వెంకట్రామన్ (8919364818), సంతబొమ్మాళి రామ్మోహనరావు(9440422302), వజ్రపుకొత్తూరు ఉమామహేశ్వరరావు (9866530885), మందస నగేష్ (7093930101), సోంపేట సత్యనారాయణ (9502225511)లను నియమించారు.

Similar News

News September 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 19, 2024

రాజాం: పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.

News September 19, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.