News December 26, 2024

శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు-ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అధికారులతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.. శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. 7390 అభ్యర్థుల్లో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళా పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News December 28, 2024

రైతు కుటుంబం ఆత్మహత్యపై అచ్చెన్న ఆరా

image

కడప జిల్లాలో ఒక రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఆరా తీశారు. రైతు కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News December 28, 2024

శ్రీకాకుళం: విద్యుత్ ధర్నాకు గైర్హాజరైన వైసీపీ ముఖ్య నేతలు

image

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.

News December 28, 2024

వీరఘట్టం: బాలికలపై లైంగిక దాడులకు పాల్పడింది ఇతనే

image

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే ఆ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వీరఘట్టం మండలంలో సంచలనంగా మారింది. తమ పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడిన ఆ గురువు తెర్లి సింహాచలంకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ చిత్రంలో ఉన్న ఆ కామాంధుడు ఇతనే.. ఈ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.