News September 12, 2024
శ్రీకాకుళం: దసరా,దీపావళికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి ఫెస్టివల్స్‌కు శ్రీకాకుళం నుంచి తిరుపతికి (07443), తిరుపతి నుంచి శ్రీకాకుళానికి (07442) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 07443 రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుందన్నారు. 07442 రైలు అక్టోబర్ 06 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుందని..ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News October 15, 2024
KGBVల్లో నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు నేడే లాస్ట్
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. ఈ మేరకు మొత్తం జిల్లాలో 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నేటి సాయంత్రంలోగా ఆయా మండలాల్లో ఉన్న ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా నెలకు రూ.15,000 చెల్లించనున్నారు. కనీస వయస్సు 21 నుంచి 42 మధ్యలో ఉండాలి.
News October 15, 2024
శ్రీకాకుళం: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. వయోజన విద్యపై కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ప్రధానంగా స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులు, ఆయాలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే నైట్ వాచ్ మన్‌లు, తదితరులు దృష్టి సారించాలన్నారు.
News October 15, 2024
కుమందానివానిపేటలో విషాదం.. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
సంతబొమ్మాళి మండలం కుమందానివానిపేటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డెక్కల రాజు, దుర్గ దంపతుల కుమారులు బాలాజీ(10), రిషి(8) మంగళవారం ఉదయం నాటికి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉదయం ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.