News October 5, 2024

శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

image

దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.

Similar News

News November 6, 2024

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పరికరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లుపై సంబంధిత అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్షించారు.

News November 5, 2024

REWIND: టెక్కలిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు

image

టెక్కలి కచేరివీధిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు అయ్యింది. 2021 నవంబర్ మాసంలో దీపావళి సందర్భంగా టెక్కలికి చెందిన ఎస్.సాయిగోపాల్, వీ.హరి, ఎస్.మూర్తి అనే ముగ్గురు స్నేహితులు ఒక ఇంటి ఆవరణలో దీపావళి చేతిబాంబులు తయారు చేస్తున్న క్రమంలో అప్పట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనతో నాడు టెక్కలి ప్రజానీకం ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులు సుదీర్ఘకాలం చికిత్స అనంతరం కోలుకుని ప్రాణాలతో బయట పడ్డారు.

News November 5, 2024

శ్రీకాకుళంలో కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఏపీసేవా, మీసేవ, పీజీఆర్‌ఎస్ సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, సీపీవో, రహదారులు, భవనాలు, విద్యా, పంచాయతీ, ఉద్యాన, APEPDCL, డ్వామా, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.