News October 4, 2024

శ్రీకాకుళం: దసరా వేళ.. భారీగా వసూళ్లు

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 4, 2024

సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లిన శ్రీకాకుళం టీం

image

యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గుంటూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శుక్రవారం యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు జిల్లా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

News October 4, 2024

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను పూర్తిచేయండి: మంత్రి

image

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

News October 4, 2024

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట విద్యార్థి

image

జాతీయస్థాయిలో ఢిల్లీలో జరగనున్న ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పలత ఎంపికైందని ప్రిన్సిపల్ పి లత, పిఈటీ భోగేశ్ గురువారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమె గెలుపొందిందని వివరించారు. ఢిల్లీ నోయిడా లో ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు.