News October 4, 2024

శ్రీకాకుళం: దసరా వేళ.. భారీగా వసూళ్లు

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 14, 2024

శ్రీకాకుళం: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు నాలుగు రోజులే గడువు

image

శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

News November 14, 2024

పాలకొండ: నటుడు పోసాని పై చర్యలు తీసుకోవాలి

image

YCP నేత, నటుడు పోసాని కృష్ణ మురళీ TTD ఛైర్మన్ బి.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కరమైన పదజాలంతో దూషించడంపై పాలకొండ టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలపై గతంలో పోసాని తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రయోగ మూర్తిని కోరారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.

News November 14, 2024

కోటబొమ్మాళి: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ మేరకు రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా వృద్ధురాలు వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.