News September 30, 2024
శ్రీకాకుళం: దసరా సెలవులకు ఊర్లకు వెళ్తున్నారా జార జాగ్రత్త
దసరా సెలవులు నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని చెప్పారు. ఎల్‌హెచ్ ఎంఎస్ ద్వారా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే ఇంటి యజమానికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందన్నారు.
Similar News
News October 10, 2024
కలెక్టర్, ఎస్పీతో చర్చించిన ఎంపీ కలిశెట్టి
విజయనగరం పైడితల్లి ఉత్సవాల నిర్వహణపై భక్తుల సలహాలు సూచనలు కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులు తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో చర్చించారు. అమ్మవారి ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
News October 9, 2024
శ్రీకాకుళం: డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని. ప్రాక్టికల్స్ ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.
News October 9, 2024
కొవ్వాడ ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం చేయాలి
కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ధర్మవరం వద్ద నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ ఆహ్మద్‌తో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ఆయన తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులపై, నిర్వాసితులకు చెల్లించాల్సిన పెండింగ్ నష్ట పరిహారాలపై చర్చించారు.