News August 15, 2024
శ్రీకాకుళం: దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ‘స్వాభిమాన్’
ప్రతి నెల మూడో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారి సలహా మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
Similar News
News September 19, 2024
కవిటి: చంద్రబాబు రాక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్
కవిటి మండలం రాజాపురానికి శుక్రవారం సీఎం రానున్నారు. రాజపురంలో జరిగే ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాకు తొలిసారిగా సీఎం వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే అశోక్ బాబు, డీఎస్పీ మహేందర్ రెడ్డి గురువారం రాజాపురానికి చేరుకుని.. ఏర్పాట్లను పరిశీలించారు.
News September 19, 2024
శ్రీకాకుళం: 100 రోజుల TDP పాలనపై మీ కామెంట్?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
News September 19, 2024
శ్రీకాకుళంలో ప్రేమ పేరుతో ఛీటింగ్
శ్రీకాకుళానికి చెందిన బాలికను ఒడిశాకు చెందిన యువకుడు మోసం చేశాడని పోలీసులను తెలిపింది. వారి వివరాలు.. బాలికకు రెండేళ్ల కిందట పెళ్లిలో కృష్ణ పరిచయమయ్యాడు. అతను పొక్లెయిన్ డ్రైవర్‌గా పైడిభీమవరంలో ఉండేవాడు. పరిచయమైనప్పటి నుంచి ప్రేమపేరిట తిరిగి, పెళ్లి చేసుకోమంటే తప్పించుకుంటున్నాడని తెలిపింది. దీనిపై శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ASI నారాయణ రావు బుధవారం తెలిపారు.