News May 5, 2024

శ్రీకాకుళం: దివ్యాంగ ఓటర్లు 21,481 మంది

image

శ్రీకాకుళం జిల్లాలో దివ్యంగా ఓటర్లు 21,481 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 31,44 మంది, అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో 2,255 ఉన్నారు. శ్రీకాకుళంలో 2,724, నరసన్నపేటలో 2,981, టెక్కలి 2,649, పాతపట్నం 2,380, పలాస 2,573, ఇచ్చాపురం 2,775 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

Similar News

News December 10, 2025

ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

శ్రీకాకుళం మహిళ దారుణ హత్య

image

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి, శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల శ్రీనివాస్‌ రైస్ పుల్లింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.

News December 10, 2025

శ్రీకాకుళం: ‘లక్ష్యాల సాధనలో ఆయా శాఖలు వేగం పెంచాలి’

image

ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచి, కీలక పనితీరు సూచికలు ఆధారంగా లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని
కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. కేపీఐ ఆధారంగానే శాఖల పనితీరు మూల్యాంకనం జరుగుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి తావులేదన్నారు.