News July 1, 2024
శ్రీకాకుళం: దోమల నివారణను అజెండాగా స్వీకరిద్దాం
దోమల నివారణను ఎజెండాగా స్వీకరించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని పిలుపునిచ్చారు. నగరంలోని డీఎంహెచ్ ఓ కార్యాలయం వద్ద డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు ప్రబలకుండా కాలువల్లో స్ప్రేయింగ్ చేయాలన్నారు.
Similar News
News November 28, 2024
పోతినాయుడుపేట వద్ద పులి సంచారం.. ఆవుపై దాడి
సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయితీ పోతినాయుడుపేట వద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని గుర్తించడం జరిగిందని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ జి జగదీశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున గ్రామంలో ఆవుపై దాడి చేయడంతో అది మృతి చెందిందని తెలిపారు.పులి సంచారంపై గురువారం గ్రామస్థులకు అవగాహన కల్పించామని చెప్పారు. రాత్రి వేళలో ఎవరు బయటకు రావద్దు అంటూ సూచించారు.
News November 28, 2024
SKLM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆదర్శమూర్తి
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మహాత్మా జ్యోతీరావు ఫూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, కెఆర్ఆర్సీ ఉప కలెక్టర్ పద్మావతి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనూరాధ ఉన్నారు.
News November 28, 2024
సీతంపేట: అడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేయాలి
సీతంపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్‌కు పర్యాటుకులు భారీ ఎత్తున సందర్శిస్తున్నారు. శీతకాలంలోని మంచు అందాలతో ఆకట్టుకుంటున్న వ్యూపాయింట్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్రధాన రహదారిని డెవలప్ చేసి పర్యాటకంగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలోనే మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ద్రుష్టి పెట్టాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.