News January 18, 2025
శ్రీకాకుళం: నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షకు 7247 మంది విద్యార్థులు హాజరైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపల్ పరసరామయ్య తెలిపారు. వీరిలో బాలురు 3845 మంది, బాలికలు 3402 మంది హాజరయ్యారు. జిల్లాలో 32 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1043 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు.
Similar News
News November 28, 2025
శ్రీకాకుళం జిల్లా రైతులకు తీపి కబురు: మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని రాష్ట్రవ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వంశధార రిజర్వాయర్లో మరో 12 టీఎంసీలు నీరు నింపేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం పనులు చేపట్టినా నిధులు విడుదల చేయలేదన్నారు.
News November 28, 2025
SKLM: కళ్ల ముందు తల్లి మృతి.. తల్లడిల్లిన కొడుకు హృదయం

కళ్ల ముందే తల్లి మృతి చెందడంతో కొడుకు హృదయం తల్లడిల్లిన ఘటన శుక్రవారం ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో చోటు చేసుకుంది. బూర్జ (M) కొల్లివలసకు చెందిన మణికంఠ తన తల్లి భానుమతితో కలిసి స్కూటీపై శ్రీకాకుళం వైపు వెళ్తున్నారు. ఆమదాలవలస ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వచ్చిన లారీ ఢీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి.
News November 28, 2025
సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ సూచించారు.


