News February 28, 2025

శ్రీకాకుళం: నాగావళి వంతెన కింద వ్యక్తి మృతదేహం

image

నాగావళి నది వంతెన కింద వ్యక్తి మృతదేహన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. స్థానికుల కథనం.. శ్రీకాకుళం మండలం తోట పాలెం జంక్షన్ వద్ద ఉన్న నీలమ్మ కాలనీకి చెందిన యాదవ రెడ్డి రాజు (40) గా గుర్తించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 25, 2025

SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

image

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.

News March 25, 2025

ఉద్దానంలో ఆకట్టుకున్న ‘ప్రేమ’ పనసకాయ

image

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం ఉద్దానం గ్రామంలో ఒక పనసచెట్టుకు కాచిన పనసకాయ LOVE ఆకారంలో ఉండటం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామానికి చెందిన ఒక రైతుకు చెందిన చెట్టుకు ఈ అరుదైన కాయ కాసింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోను గ్రామస్థులు, యువత సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలో ప్రేమ పనస అంటూ ఫొటోను SHARE చేస్తున్నారు.

News March 25, 2025

శ్రీకాకుళం: అనుమానంతోనే హత్యలు

image

నందిగాం మండలం కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ తూ.గో జిల్లా హుకుంపేటలో ఆదివారం తల్లి కూతుళ్లను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు సానియా, శివకుమార్‌కు ఓ ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. నిందితుడు ఆమె ఫోన్‌లో మరొకరితో చాటింగ్ చేయడాన్ని చూసి సహించని శివకుమార్.. పథకం ప్రకారం ఆ యువతితో పాటు తల్లిని కూడా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.

error: Content is protected !!