News April 5, 2024
శ్రీకాకుళం: నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థుల ప్రకటన

జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.
Similar News
News September 15, 2025
సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్కు 81 అర్జీలు

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.
News September 15, 2025
టెక్కలి: బహుభాషా కోవిధుడు రోణంకి

టెక్కలికి చెందిన ఆచార్య రోణంకి అప్పలస్వామి 1909లో జన్మించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(ఆంగ్లం) పూర్తిచేసిన ఈయన ఆంధ్రాయూనివర్సిటీలో ఆచార్యునిగా బోధించారు. ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్ వంటి భాషలను అధ్యయనం చేశారు. బహుభాషా కోవిధుడుగా ఆదర్శంగా నిలిచారు. 1922-77 కాలంలో జాతీయ ఉపన్యాసకునిగా భారత ప్రభుత్వం నియమించింది. టెక్కలిలో విగ్రహంతో పాటు ఒక వీధికి ఈయన పేరు పెట్టారు. నేడు రోణంకి 116వ జయంతి.