News February 1, 2025
శ్రీకాకుళం: నిమ్మాడ హైవేపై కారు బోల్తా

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Similar News
News February 17, 2025
అరసవల్లి: ఆదిత్యుని నేటి ఆదాయం

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,15,000/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,08,740/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,22,670/-లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.
News February 16, 2025
జలుమూరు: మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత

జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు ఈ నెల 17, 18, 20 తేదీల్లో మూసి వేస్తున్నట్లు రైల్వే సెక్షన్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలాస నుంచి శ్రీకాకుళం వరకు రైలు మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ దారిలో ప్రయాణించే వాహనాలు మళ్లింపు చేస్తున్నామని ప్రయాణికులు సహకరించాలని కోరారు.
News February 16, 2025
టెక్కలి: యువకుడి బ్రెయిన్‌డెడ్.. అవయవదానం

టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపట్నం మండలం నల్లబొంతు గ్రామానికి చెందిన మామిడిపల్లి సతీష్ (24) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు.. శనివారం యువకుడి నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.