News September 28, 2024
శ్రీకాకుళం: నిర్మాణాలు పూర్తి చేయకపోతే రద్దువుతాయి
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. మన ఇళ్లు..మన గౌరవం పథకంలో ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పూర్తిచేయకపోతే ఆ నిర్మాణాలు రద్దవుతాయని స్పష్టం చేశారు.
Similar News
News October 5, 2024
శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.
News October 5, 2024
శ్రీకాకుళం: దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు
దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.
News October 5, 2024
శ్రీకాకుళం: రేపటి నుంచి దసరా సెలవులు
డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలకు ఈనెల 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ దసరా సెలవులు (6వ తేదీ ఆదివారం సెలవు ) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పీలా సుజాత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 13వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 14 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ప్రకటనలో సూచించారు.