News March 25, 2024
శ్రీకాకుళం నుంచి ఆరుసార్లు గెలిచారు

ప్రస్తుత రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారిపోయింది. అలాంటిది శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు 1952 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎల్.ఎన్.రాజును పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1957-84 ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఆయనది ఆమదాలవలస మండలం అక్కులపేట.
Similar News
News April 22, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 79 వినతలు

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే వినతులు పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏఎస్పీ కెవి రమణ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తం 79 అర్జీలు వచ్చినట్లు చెప్పారు.
News April 21, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ ఫలితాలను నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఫలితాలను https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్‌లో చూడాలని చెప్పారు. డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరుగుతాయని తెలిపారు.
News April 21, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 154 వినతులు

ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వేదికైంది. సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో “మీ కోసం” కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 154 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.