News March 28, 2025
శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్‌ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.
Similar News
News April 3, 2025
జలుమూరు: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఎంపైర్‌గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
News April 3, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు శుభవార్త

శ్రీకాకుళం, పలాస మీదుగా హైదరాబాద్(HYD)- కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నం.07165 HYD- CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC- HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడుస్తుందన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
News April 3, 2025
ఆమదాలవలస: ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని బోదేపల్లి రాజగోపాల్ నగర్‌కి చెందిన జ్యోత్స్నకి రెండు రోజులు కిందట వెలువడిన ఫలితాలో మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్ అండ్ టి కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌గా ఎంపికైంది. ఈమె తల్లితండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జ్యోత్స్నకి పలువురు అభినందించారు.