News August 24, 2024
శ్రీకాకుళం: ‘నూతన చట్టాలపై అవగాహన ఉండాలి’
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు, ప్రాపర్టీ స్వాధీనంలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలి అని, నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని నార్కో డ్రగ్స్, సైబర్ కేసులు దర్యాప్తు, నూతన చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. అదనపు ఎస్పీ, పోలీస్ లీగల్ అడ్వైజర్‌లు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2024
SKLM: సెబ్ కానిస్టేబుల్ విజయ్‌పై వేటు
భార్య అనూష మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సెబ్ డీఎస్‌ఈవో తిరుపాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. సెబ్ కానిస్టేబుల్ అనూష మృతిచెందిన ఘటనలో విజయ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News September 14, 2024
SKLM: రిమ్స్‌లో నవజాత శిశువు మృతి
నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం అంగన్వాడీ కేంద్రం వద్ద మతిస్థిమితం లేని మహిళ అప్పాజీ ఈనెల 8వ తేదీన రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నెలల వయస్సు, బరువు తక్కువగా ఉన్న శిశువును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.
News September 14, 2024
శ్రీకాకుళం: అధ్వానంగా రోడ్డు
శ్రీకాకుళం వెళ్లే మార్గమధ్యలో రాగోలు వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు మొత్తం బుదరమయంగా మారింది. భారీ వాహనాలు కొన్ని బుదరలో కూరుకుపోయాయి. ఈ మార్గలో రాకపోకలు సాగించే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మీ ఏరియాలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయా? ఉంటే ఎక్కడో కామెంట్ చేయండి.