News August 26, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి క్రీడా పోటీలు

image

శ్రీకాకుళం: ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సోమవారం నుంచి వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు డీఎసీవో కె.శ్రీధర్‌రావు తెలిపారు. క్రీడావికాస కేంద్రాల్లో పోటీలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News October 26, 2025

పాతపట్నం: ‘గురుకుల పాఠశాలను సందర్శించిన సమన్వయ అధికారి’

image

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని, విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మీ అన్నారు. పాతపట్నం మండలంలోని ప్రహరాజపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని, డార్మెటరీని, మరుగుదొడ్లను పరిశీలించారు.

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈శ్రీకాకుళం జిల్లాలో భక్తిశ్రద్ధలతో నాగులచవితి వేడుకలు
◈శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయ్యేదెన్నడు..?
◈టెక్కలి: జిల్లాలో రవాణాశాఖ అధికారుల విస్తృత తనిఖీలు
◈మందస: అగ్నిప్రమాదంలో నాలుగు పూరిల్లు దగ్దం
◈ఆదిత్యుని సేవలో హై కోర్టు జస్టిస్
◈టెక్కలి: పశువైద్య మందుల కొరత తీర్చండి
◈గార: నాగులచవితి వేడుకలకు ఆ గ్రామం దూరం

News October 25, 2025

శ్రీకాకుళం: పీజీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడో..?

image

పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈఏడాది జూన్ 9-12 వరకు పీజీ సెట్ జరగగా..25న ఫలితాలొచ్చాయి. సెప్టెంబర్ 22న మొదట, అక్టోబర్ 12న రెండో కౌన్సిలింగ్ నిర్వహించినా.. ఇప్పటికీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ ఏడాది కొన్ని కోర్సుల్లో జీరో అడ్మిషన్ల్ నమోదయ్యాయి.