News August 8, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి బి.టెక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్అంబేడ్కర్ యూనివర్సీటీ బీటెక్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఆగష్టు 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800 ప్రాక్టికల్, వైవా రూ.250 ఫీజుతో కలిపి మొత్తం రూ.1,050 లను చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధి రుసుముతో 16 వరకు రూ.2000 అపరాధ రుసుముతో 17 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
Similar News
News November 23, 2025
నేడు శ్రీకాకుళం రానున్న విజయసాయిరెడ్డి

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.
News November 23, 2025
బెల్జియం అమ్మాయి.. సిక్కోలు అబ్బాయి.. కట్ చేస్తే!

బెల్జియం దేశానికి చెందిన యువతి శ్రీకాకుళానికి చెందిన యువకునికి ఘనంగా వివాహం జరిగింది. శ్రీకాకుళం హయాతి నగర్కు చెందిన యువకుడు శ్రీ రంగనాథ సాహిత్ బెల్జియంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న కెమిలీ మస్కర్తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో శ్రీకాకుళంలో శనివారం రాత్రి జరిగిన వివాహంతో వారిద్దరు ఒకటయ్యారు.
News November 23, 2025
శ్రీకాకుళం: దైవ దర్శనాలకు వెళ్తూ మృత్యుఒడిలోకి..!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు వ్యాన్లో దైవ దర్శనాలకు వెళ్తూ <<18364371>>మృత్యుఒడిలోకి<<>> చేరుకున్నారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అయోధ్య, కాశీ, పూరీ వంటి క్షేత్రాలు దర్శించుకున్న అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.


