News August 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి బి.టెక్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్‌అంబేడ్కర్ యూనివర్సీటీ బీటెక్ 2వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఆగష్టు 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800 ప్రాక్టికల్, వైవా రూ.250 ఫీజుతో కలిపి మొత్తం రూ.1,050 లను చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధి రుసుముతో 16 వరకు రూ.2000 అపరాధ రుసుముతో 17 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.

Similar News

News July 11, 2025

ఎచ్చెర్ల: దారుణంగా హత్య చేశారు

image

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2025

సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

image

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News July 11, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు