News January 10, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 19 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీనితో విద్యార్థులు ఊళ్లకు పయనమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు కచ్చితంగా సెలవులు అమలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 14, 2025

శ్రీకాకుళం: కొట్లాట ఘటనలో నలుగురిపై కేసు నమోదు

image

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో సోమవారం జరిగిన కొట్లాట ఘటనలో ఇరువర్గాలకు చెందిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జీ.చిట్టిబాబు, ఎస్.విశ్వనాథం మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో వారు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు.

News January 14, 2025

SKLM: కళాశాల విద్యార్థిని అదృశ్యం

image

శ్రీకాకుళం పాత్రునివలసలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. కళాశాలకు ఈ నెల 11 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వస్తానని చెప్పి రాలేదని తండ్రి శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.

News January 14, 2025

శ్రీకాకుళం: ఓకే గులాబి మొక్కకు మూడు రంగుల పువ్వులు

image

ఓకే గులాబి మొక్కకు మూడు రంగులు కలిగిన పువ్వులు పూయడంతో పలువురు ఈ మొక్కను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. శ్రీకాకుళంలోని నరసన్నపేట మండలం వీరన్నాయుడు కాలనీలో ఉన్న సూరపు భీమారావు ఇంట్లో ఇది కనువిందు చేసింది. గత కొద్దిరోజులుగా ఇటువంటి గులాబీ మొక్కలను ఆయన పెంచుతున్నాని చెప్పారు. దీనిపై ఉద్యానవన శాఖ అధికారి ఆమని వద్ద ప్రస్తావించగా మొక్కలకు అంటు పెట్టినప్పుడు ఇలా అరుదుగా పువ్వులు పూస్తుందన్నారు.