News October 3, 2024
శ్రీకాకుళం: నేటి నుంచి 13 వరకు దసరా సెలవులు

జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ఆర్ఎఓ పి.దుర్గా రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు రోజుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులకు సహాయపడుతూ బాధ్యతగా ఉండాలని కోరారు. బైక్ రైడింగ్లు, బీచ్‌లకు గాని వెళ్లరాదన్నారు
Similar News
News November 14, 2025
నౌకా నిర్మాణ హబ్‌గా విశాఖ-శ్రీకాకుళం కారిడార్: CM

విశాఖలో గురువారం జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్–2025లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.
News November 14, 2025
SKLM: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తాం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు అందజేస్తామని ఏపీ మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. NSFC కింద 450 రుణాలుకు 3 వేల దరఖాస్తులందయాని ఆమె వివరించారు. రూ 1.80 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని త్వరలో ఎంపిక చేసి రుణాలు ఇస్తామన్నారు. అధికారులు గడ్డమ్మ సుజాత పాల్గొన్నారు.
News November 13, 2025
ఎచ్చెర్ల: ఎనిమిది మంది విద్యార్థులు సస్పెండ్

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఎస్.ఎం.పురం క్యాంపస్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి క్యాంపస్‌లో చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కుటుంబీకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది.


