News September 5, 2024
శ్రీకాకుళం: నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు రాక

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉదయం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
Similar News
News January 10, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★ఇచ్ఛాపురం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్.
★పలాసలో కొండలు, చెరువులు మాయం అవుతున్నాయి: సీదిరి
★బట్టేరు: గొంతు తడవాలంటే.. కావిడి పట్టాల్సిందే
★శ్రీకాకుళం: పెరిగిన ప్రయాణీకుల రద్దీ
★ఇచ్ఛాపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు
★శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో మరమ్మతుల పనులు
★ కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు
News January 10, 2026
కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News January 10, 2026
శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.


