News August 3, 2024
శ్రీకాకుళం: నేడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాక
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని తన స్వగృహానికి చేరుకుంటారని, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన జిఎం, డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహిస్తారని, మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ సన్రైజ్‌కు చేరుకుంటారని చెప్పారు.
Similar News
News September 9, 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ
శ్రీకాకుళంలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 8, 2024
వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది: సీఎంఓ
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాత్రి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను కోరారు. జిల్లా ఉన్నతాధికారులు వరద ప్రవాహాంపై క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు.