News January 17, 2025
శ్రీకాకుళం: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

శ్రీకాకుళంలో ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనునట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: మానవ హక్కులపై అవగాహన తప్పనిసరి

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వినియోగదారుల కోర్ట్ సభ్యురాలు జి.రాధారాణి అన్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళంలోని ఓ డిగ్రీ కళాశాలలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అధికారాల గురించి సమాచారం తెలియకపోవడంతో వినియోగించుకోవడం లేదని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
News December 11, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి చెందిన బగాది కృష్ణారావు (86) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, ఉమా శంకర్ వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
News December 11, 2025
శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.


