News March 3, 2025

శ్రీకాకుళం: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సోమవారం విశాఖలో జరగనుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలోని 31 కేంద్రాల్లో పోలింగ్ జరగగా 5,035 ఓట్లకు గాను 4,769 ఓట్లు పోల్ అయ్యాయి. 94.7 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా విజయం ఎవరిని వరిస్తోంది అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Similar News

News March 21, 2025

గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

image

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. 

News March 21, 2025

టెక్కలి: విద్యార్థుల సహనానికి “పరీక్ష”

image

టెక్కలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు మండుటెండలో అవస్థలు పడ్డారు. ఉదయం 8.45 గంటలకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో మండుటెండలో నిలబడ్డారు. అధికారుల తీరుపై కొంత మంది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్థులను లోపలికి అనుమతించారు. 

error: Content is protected !!