News March 19, 2024
శ్రీకాకుళం: పది పరీక్షలకు 446 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం ఒక తెలిపారు. మొత్తం 29,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,662 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 446 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Similar News
News November 17, 2025
SKLM: ‘కుష్టు వ్యాధిపై సర్వేకు 2,234 బృందాలు నియమించాం’

కుష్టు వ్యాధిపై సర్వేకు జిల్లా వ్యాప్తంగా 2,234 బృందాలను నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు DMHO డాక్టర్ తాడేల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 17-31 వరకు ఈ వ్యాధిపై ఆశా కార్యకర్త, వాలంటీర్లు రోజుకు 20 గృహాల్లో సర్వే నిర్వహిస్తారన్నారు. స్పర్శ లేని మచ్చలను గుర్తించాలని ఆయన వారికి చెప్పారు.
News November 16, 2025
కన్నా లేవారా.. కన్నీటి రోదన మిగిల్చిన నీటి కుంట

కళ్లెదుట ఉన్న పిల్లలు నీటి కుంటలో పడి కానారాని లోకాలకెళ్లారని కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. కన్నా..లేవరా అంటూ..చిన్నారుల మృతదేహాలపై పడి కన్నవారి కన్నీటి రోదనకు..ఊరంతా వేదనలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి(M) పంటిగుంటకు చెందిన అవినాష్(9), సుధీర్(8)లు ఆదివారం సాయంత్రం నీటి కుంటలో స్నానానికి దిగి ..ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. దీనిపై SI సింహాచలం కేసు నమోదు చేశారు.
News November 16, 2025
మరోసారి ఐపీఎల్కు సిక్కోలు యువకుడు

ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.


