News April 1, 2024
శ్రీకాకుళం: పనసకు మంచి గిరాకీ
జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్, కటక్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.
Similar News
News November 24, 2024
IPL వేలంలో మన శ్రీకాకుళం కుర్రాడు.!
ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన శ్రీకాకుళం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
SKLM: డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా.. అభ్యర్థుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా డీఎస్సీకి ఎటువంటి నోటిఫికేషన్ కు నోచుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈనెల నాలుగవ తేదీన టెట్ ఫలితాలు కూడా విడుదల కాగా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 16 వేల పోస్టులకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 400 పోస్టులకు పైగా భర్తీ చేయనున్నారు.
News November 23, 2024
శ్రీకాకుళం: ‘రూ.20 లక్షలతో బిజినెస్ పెట్టండి’
శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాలలో అగ్రి క్లినిక్స్ & అగ్రి బిజినెస్ సెంటర్స్ (ACABC) స్కీమ్‌పై నాబార్డ్ జిల్లాస్థాయి వర్క్‌షాప్ శుక్రవారం జరిగింది. నాబార్డ్ డీడీఎం రమేశ్ కృష్ణ మాట్లాడుతూ.. అగ్రి గ్రాడ్యూయేట్లు ఈ పథకం ద్వారా రూ.20 లక్షలతో బిజినెస్ చేస్తే రూ.8.8 లక్షల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు. అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.