News March 14, 2025

శ్రీకాకుళం: పాఠశాలలకు నేడు సెలవు.. రేపటినుంచి ఒంటి పూట బడులు

image

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.  అయితే మధ్యాహ్న భోజనం యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

శ్రీకాకుళం ఎంపీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తున్న మంత్రి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

image

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.