News January 12, 2025
శ్రీకాకుళం: పాఠశాలల్లో కొత్తగా క్లస్టర్ విధానం

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 235 కాంప్లెక్స్‌లకు గాను 170A క్లస్టర్లుగా.. 65బి క్లస్టర్లగా విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ తిరుమల చైతన్య తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలో మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు వచ్చాయన్నారు.
Similar News
News March 14, 2025
శ్రీకాకుళం: పాఠశాలలకు నేడు సెలవు.. రేపటినుంచి ఒంటి పూట బడులు

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించారని డీఈఓ తిరుమల చైతన్య తెలిపారు. గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ శనివారం నుంచి ఒంటి పూట బడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అయితే మధ్యాహ్న భోజనం యథాతథంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News March 14, 2025
టెక్కలి: ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

టెక్కలి మండలం పెద్దసాన ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. పాఠశాలలో విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారి ఫిర్యాదు మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయుడు గతంలో కూడా ఒకసారి సస్పెన్షన్‌కు గురయ్యారు.
News March 14, 2025
ఎచెర్ల: 6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు పెంపు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ ఆరవ సెమిస్టర్ internship పరీక్ష ఫీజులను చెల్లించుటకు మార్చి 25వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పొడిగించామని యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఇంటర్నషిప్ వైవ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు ఉంటాయని తెలియజేశారు.