News January 4, 2025

శ్రీకాకుళం: పాపం..చిట్టి తల్లికి ఎంత కష్టం వచ్చిందో..

image

వీరఘట్టం మండలంలోని అడారు గ్రామానికి చెందిన వండాన సంతోష్ కుమార్, హేమలత దంపతులకు లక్ష్యతా శ్రీ 9 నెలల క్రితం జన్మించింది. ఇంతలోనే ఆ చిన్నారికి బ్రెయిన్ సంబంధిత వ్యాధి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చిన్నారి బ్రెయిన్‌లో కణతులు ఉండటంతో వైద్యం సాధ్యం కాదని డాక్టర్లు చేతేులెత్తేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జేమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చిన్నారి మరణించింది.

Similar News

News January 19, 2025

ఇచ్ఛాపురం: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

image

ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం బోనసాల ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంతపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, సోంపేట ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులను గాయపడ్డారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 19, 2025

పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని పేషంట్ మృతి

image

పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉరివేసుకుని బెవర జోగినాయుడు అనే పేషంట్ ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన ఈయన పాంక్రియాటైటిస్‌తో బాధపడతూ శనివారం ఆసుపత్రిలో చేరారు. ఏం జరిగిందో ఏమో గాని ఆదివారం మేల్ వార్డు బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్‌కు పాల్పడ్డాడు. మృతునికి భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News January 19, 2025

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట జంక్షన్ సమీపంలో అలికాం-బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హిరమండలం కొండరాగోలుకు చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) అనే యువకుడు మృతి చెందినట్లు సరుబుజ్జిలి ఎస్సై బి.హైమావతి తెలిపారు. ఆమదాలవలసలోని స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది.