News September 20, 2024
శ్రీకాకుళం: పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మాజీ స్పీకర్ సీతారాం

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి MP సెగ్మెంట్ ఇన్ఛార్జ్గా ఆమదాలవలస మాజీ MLA తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్లు YCP అధినేత జగన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో, MLAలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పదవులు కేటాయించినట్లు సమాచారం.
Similar News
News November 27, 2025
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో 18-25 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు అన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు నవీకరించిన బయోడేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలతో హాజరు కావాలన్నారు.

News November 26, 2025
టెక్కలి: సెప్టిక్ ట్యాంక్లో పడి చిన్నారి మృతి

టెక్కలిలోని మండాపోలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) బుధవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా నిర్మాణ దశలో ఉన్న మరో ఇంటికి చెందిన సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.