News September 20, 2024

శ్రీకాకుళం: పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మాజీ స్పీకర్ సీతారాం

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి MP సెగ్మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఆమదాలవలస మాజీ MLA తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్లు YCP అధినేత జగన్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్రకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో, MLAలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పదవులు కేటాయించినట్లు సమాచారం.

Similar News

News July 8, 2025

SKLM: మెగా పీటీఎం 2.0 పై దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

జూలై 10న నిర్వహించబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం శ్రీకాకుళం మండలంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో DEO చైతన్య, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ భోజనం పథకంపై వివరించాలని, విద్యార్థులుకు ఆటల పోటీలపై దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటాలన్నారు.

News July 8, 2025

నరసన్నపేట: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నరసన్నపేట మండలం ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్ సీ మధుసూదనరావు అందించిన వివరాలు మేరకు మంగళవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహం పడి ఉండడాన్ని గమనించి స్థానికులు సమాచారం అందించారని చెప్పారు. మృతునికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని, గులాబీ టీ షర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

News July 8, 2025

శ్రీకాకుళం: 10న ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని బలగలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ కాలేజీలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇంటర్, ఐటిఐ ఫిట్టర్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ విద్యార్హత కలిగి 26 ఏళ్ల లోపు యువతీ యువకులు అర్హులని తెలిపారు.