News August 28, 2024
శ్రీకాకుళం: పింఛన్ల పంపిణీ తర్వాతే సచివాలయ ఉద్యోగుల బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తరువాతే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి రిలీవింగ్ పత్రాలు ఇవ్వాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్‌లకు బుధవారం ఆశాఖ స్టేట్ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కీలకంగా ఉన్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ తరువాత బదిలీ అయిన వారిని ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ చేయాలని సూచించారు.
Similar News
News October 22, 2025
శ్రీకాకుళం: ‘ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి’

ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు . జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుల మందు రహిత వ్యవసాయం లక్ష్యంగా రైతులు ముందుకు సాగాలని అన్నారు. సహజ ఎరువులు, కషాయాలు వినియోగించాలని కోరారు.
News October 21, 2025
డీజే ఓ నిశ్శబ్ద హంతకి

పట్టణం, పల్లెలో డీజే శబ్దాలు హోరెత్తిస్తున్నాయి. శబ్ద తీవ్రత 50 డేసిబెల్స్ దాటితే మానవులకు గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలను నిర్వాహకులు పెడచెవిన పెట్టి పెద్ద శబ్దాలకు 100 డేసిబెల్స్ పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నెల16న నరసన్నపేటలోని <<18018296>>భవానిపురంలో<<>> గౌరమ్మ ఊరేగింపులో డీజే శబ్దానికి భవనం కూలి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.
News October 21, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరానికి చెందిన కే.కే. వి పురుషోత్తమరావు (కళ్యాణ్) మంగళవారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణి నేత్ర సేకరణ కేంద్రం ద్వారా ఆయన నేత్రాలను సేకరించి విశాఖపట్నంలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి అందజేశారు.