News July 10, 2024
శ్రీకాకుళం: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే
ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.
News October 12, 2024
అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ
విజయదశమి సందర్భంగా గ్రామాల్లో అమ్మవారికి కొమ్మలు వేసే సమయంలో వర్గాలుగా వీడి కొట్లాటకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల వారీగా రౌడీ షీట్ నమోదైన వారు, ఆకతాయిల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. అలాంటివారిపై పూర్తి నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు.