News June 26, 2024
శ్రీకాకుళం: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో మే-2024లో నిర్వహించిన MSC నాలుగవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News February 7, 2025
శ్రీకాకుళం: యాచనకు వచ్చి.. మహిళపై దాడి

యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.
News February 7, 2025
SKLM: రహదారి నిర్మాణానికి రూ.45.50 కోట్లు మంజూరు

వెంకటాపురం నుంచి సంతబొమ్మాలి మండలం నౌపడ రహదారి నిర్మాణానికి రూ.45 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు సామాజిక కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు గురువారం తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
News February 7, 2025
రెండు కుటుంబాలను చిదిమేసిన రోడ్డు ప్రమాదం

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్‌పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.