News November 29, 2024

శ్రీకాకుళం: పులి పాదముద్రల గుర్తింపు 

image

సంతబొమ్మాళి మండలంలో పులి తిరుగుతున్నట్లు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. తాజాగా పులి అడుగులను గురువారం గుర్తించారు. సంతబొమ్మాళి మండల ప్రజలను అప్రమత్తం చేస్తూ అటవీశాఖ అధికారులు పోస్టర్‌ విడుదల చేశారు. ప్రస్తుతం రైతులు పొలాల్లో కోతలు, నూర్పులు చేస్తున్నారు. దీంతో పులి సంచారం వార్తతో భయపడుతున్నారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.

Similar News

News November 29, 2024

గొండు మురళిని విశాఖ కోర్టుకు తరలింపు

image

మాజీ మంత్రి ధర్మాన మాజీ పీఏ మురళి నివాసంలో బుధవారం నుంచి ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఆ దాడుల్లో రూ. 50 కోట్లకు పైగా విలువచేసే బంగారం, వెండి, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అరెస్ట్ చేయగా.. అతడిని మరో గంటలో విశాఖ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.  

News November 29, 2024

SKLM: కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.

News November 28, 2024