News July 8, 2024
శ్రీకాకుళం: పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ఒడిశాలోని పూరీకి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 13వ తేదీ రా.8.00 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు. మరిన్ని వివరాలకు 73829 21647, 99592 25608 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News October 20, 2025
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు: ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి

నేడు దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు అయింది. ఈ విషయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్క రోజు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.
News October 20, 2025
శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న డీఆర్ఓ

దక్షిణ కాశీగా పేరు ఉన్న జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువైన శ్రీముఖలింగేశ్వర స్వామిని శ్రీకాకుళం డీఆర్ఓ (జిల్లా రెవెన్యూ అధికారి) వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఆ కుటుంబానికి అందించారు. ఆలయ అనువంశిక అర్చకుడు రాజశేఖర్ మధుకేశ్వరుని తీర్థప్రసాదములను, చిత్రపటాన్ని వారికి ఇచ్చారు.
News October 19, 2025
ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాధాన్యత: కేంద్రమంత్రి

గార మండలం శ్రీకూర్మం గ్రామంలో ఉన్న శ్రీకూర్మనాథుని ఆలయంతో పాటు కూర్మ గుండం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యేలు గొండు శంకర్, అతిధి గజపతిరాజుతో కలిసి కూర్మ గుండాన్ని పరిశీలించారు. శ్రీకూర్మంలో రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.