News May 20, 2024
శ్రీకాకుళం: పెట్రోల్ బంకులకు జిల్లా కలెక్టర్ సూచనలు
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సీసాలు, క్యాన్‌ల ద్వారా పెట్రోల్ అమ్మకంపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం చేపట్టినట్టు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న 120 పెట్రోల్ బంకుల నుంచి
లూజ్ పెట్రోల్ విక్రయాలు చేయకుండా సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని డియస్ఓ బి.శాంతి శ్రీని ఆదేశించారు.
Similar News
News December 6, 2024
SKLM: సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్
సిక్కోలు జిల్లా వాసి ఒకరు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. జలుమూరు(M) లింగాలవలసకు చెందిన జి.సంతోష్(34) HYDలో క్యాబ్ నడుపుతూ తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. స్కూల్ ఫీజ్ కోసం చింటూ అనే వ్యక్తి దగ్గర రూ.60వేలు అప్పు తీసుకున్నారు. 3నెలలు వడ్డీ చెల్లించాక కారు రిపేర్ కావడంతో డబ్బులు కట్టలేకపోయారు. చింటూ నుంచి వేధింపుల రావడంతో మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకున్నాడు. నిన్న కేసు నమోదైంది.
News December 6, 2024
ఎచ్చెర్ల: ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం
ఎచ్చెర్లలోని పోలీస్ మైదానంలో 62వ హోంగార్డు ఆవిర్భవ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని హోంగార్డుల సేవలను ఎస్పీ కొనియాడారు. వాళ్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News December 6, 2024
జగన్‌తో సమావేశానికి ధర్మాన, దువ్వాడ గైర్హాజరు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్ బుధ, గురువారం కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడంతో పలు అంశాలపై చర్చించారు. ఇంతటి కీలకమైన సమావేశానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరు కాలేదు. ఎన్నికల తర్వాత వైసీపీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉన్నారు. కీలకమైన సమావేశానికి సైతం గౌర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఈ సమావేశానికి రాలేదు.