News May 14, 2024

శ్రీకాకుళం: పెరిగిన పోలింగ్‌.. ఎవరికి మేలు..?

image

శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 72.41 శాతం నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు 75.41 శాతం నమోదైంది. మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గతంతో పోలిస్తే సుమారు 3 శాతం మేర ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్‌తో అధికార, ప్రతిపక్షాలు తమకే మేలు జరుగుతున్నాయని ఆశిస్తున్నాయి.
– మరి మీ కామెంట్ ఏంటి..?

Similar News

News October 1, 2024

శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఉదయం నుంచి సేల్స్ మాన్‌లు, సూపర్వైజర్‌లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్‌లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.

News October 1, 2024

కలెక్టర్‌ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

image

ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

News October 1, 2024

శ్రీకాకుళం: 12 మంది సీఐ, 21 మంది ఎస్సైలు బదిలీ

image

ఎక్సైజ్ Dy కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 12 మంది CI లను నూతనంగా నియమించారు. 21 మంది SIలు బదిలీ జరిగింది. CIలు గోపాలకృష్ణ-శ్రీకాకుళం, సతీష్ కుమార్-ఆమదాలవలస, అనురాధాదేవి-రణస్థలం, రాజు-పొందూరు, రమణమూర్తి-నరసన్నపేట, కృష్ణారావు-పాతపట్నం, కిరణ్మణీశ్వరి-కొత్తూరు, మీరాసాహెబ్-టెక్కలి, గాయత్రి-కోటబొమ్మాళి, మల్లికార్జునరావు-పలాస, బేబీ-సోంపేట, ప్రసాద్-ఇచ్ఛాపురానికి నియమితులయ్యారు.