News February 26, 2026
శ్రీకాకుళం: పొన్నాడ వంతెన వద్ద వ్యక్తి దారుణ హత్య?

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్‌రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 15, 2026
SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.
News April 15, 2026
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు సిద్ధం

APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్‌పోర్ట్ రూట్‌లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.