News December 17, 2024

శ్రీకాకుళం: పోలీసులపై దాడి.. నిందితుల అరెస్టు

image

శ్రీకాకుళం జిల్లా పోలీసులపై ఈ నెల 12వ తేదీ రాత్రి రాజమండ్రిలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి ఒక కేసులో ముద్దాయి రాపాక ప్రభాకర్(ప్రతాప్ రెడ్డి)ని తీసుకువెళ్లిన ఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై దాడికి పాల్పడిన భీమవరం, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన 12 మందిని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు.

Similar News

News January 18, 2025

శ్రీకాకుళం: జనసేన నాయకురాలు కాంతిశ్రీ మృతి

image

ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతి శ్రీ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో గొలివి ఆసుపత్రిలో చేరిన ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా ఈమె ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆర్థిక సహాయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్థివదేహాన్ని సందర్శనార్థం 9 తర్వాత స్వగృహానికి తెస్తారని తెలిపారు.

News January 18, 2025

చంద్రబాబు మీటింగ్‌కి పలువురు మంత్రులు గైర్హాజరు

image

CM చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలో పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, MP గంటి హరీశ్, అంబికా లక్ష్మీ నారాయణలు గైర్హాజరయ్యారు. కమిటీ మీటింగులు, ఇతర పనులు పార్టీ మీటింగ్ కంటే ఎక్కువా? అని CM సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.

News January 17, 2025

సంతబొమ్మాళి: మనస్తాపంతో సూసైడ్: ఎస్సై

image

పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతబొమ్మాళిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం గొల్లపేట గ్రామానికి చెందిన పాలిన వీరస్వామి బుధవారం భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని ఎస్సై సింహాచలం తెలిపారు.