News July 16, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Similar News

News October 16, 2024

LLB పరీక్ష టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.

News October 16, 2024

సంతబొమ్మాళి ఘటనలో తల్లి మృతి

image

సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.

News October 16, 2024

పలాస: టీడీపీ సానుభూతిపరులపై దాడి

image

పలాస నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగ్గా పలువురు గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామానికి చెందిన గంగయ్య గతంలో టీడీపీ కోసం పనిచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు గంగయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేశారు. అడ్డుకున్న కుమారుడు గిరిపై కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.